BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదు

by Satheesh |
BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. జీవన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారంటూ సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అనుచరులతో కలిసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు మాజీ ఎమ్మె్ల్యే జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా జీవన్ రెడ్డి ఇప్పటికే ఆర్టీసీ ల్యాండ్ లీజ్ రెంట్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే జీవన్ రెడ్డితో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story