- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Rajasingh పై మరో కేసు నమోదు
దిశ, డైనమిక్ బ్యూరో : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీన హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ఓ వర్గంపై మంగళవారం తన ట్విట్టర్ అకౌంట్‌లో అయోద్యపై రాజాసింగ్ చేసిన పోస్ట్ రెచ్చగొట్టేలా ఉందంటూ మంగళ్‌హాట్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రెండురోజుల్లో వివరణ ఇవ్వాలని..లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మంగళ్‌హాట్ పోలీసులు జారీ చేసిన నోటీసులపై రాజాసింగ్ లాయర్ కరుణాసాగర్ సంజాయిషీ ఇచ్చారు.
అయితే, లాయర్ కరుణాసాగర్ పంపిన నోటీసుల్లోని అంశాలు సంతృప్తికరంగా లేవని పోలీసులు చెప్పారు. దీంతో, మంగళ్ హట్ పోలీసులు రాజాసింగ్ పై మరో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనపై కేసు నమోదు చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసులు తనపై కావాలనే కక్ష్య కడుతున్నారని మండిపడ్డారు. బాబ్రీ మసీదుపై ఓవైసీ సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. డీజీపీ పదవి కోసం సీవీ ఆనంద్ తనపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. నన్ను ఎన్ కౌంటర్ చేస్తే డీజీపీ పదవి ఇస్తారన్నారెమో అంటూ విమర్శించారు. ఓవైసీ సోదరులు మాట్లాడితే తప్పు లేనిది..నేను మాట్లాడితే తప్పేంటని రాజాసింగ్ ప్రశ్నించారు.
Read More....