- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫోన్ ట్యాపింగ్ కేస్: భుజంగరావు, తిరుపతన్నకు మరో ఎదురు దెబ్బ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన సస్పెండ్ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. జూన్ 3వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన సస్పెండ్ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం జైలులో ఉన్నారు. దీంతో తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో ఇది వరకే ఓ సారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో మరోసారి భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.