- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీయూ రిజిస్ట్రార్ నియామకంలో మరో బిగ్ ట్విస్ట్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం హై డ్రామా నడిచింది. వీసీ రవీందర్ గుప్తా టీయూ కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఈసీఈ హెడ్ నిర్మల దేవిని నియమించారు. ఆమె మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించగా సాయంత్రానికి అవి చెల్లవంటూ ఆమెను వెనక్కి రావాలని ఓయూ నుంచి ఉత్తర్వులు రావడం కలకలం రేపింది. తెలంగాణ విశ్వవిద్యాలయం వివాదాలకు కేరాఫ్‌గా మారింది. టీయూ ఉపకులపతి వర్సెస్ నవీన్ మిట్టల్ వ్యవహారం టీయూను మరింత వివాదంలోకి నెట్టేసింది. గత నెలలో జరిగిన తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం మొదలుకొని ప్రారంభమైన వీసీ వర్సెస్ ఈసీగా వివాదాలు చెలరేగాయి. పాలకమండలి సమావేశాన్ని వీసీ బైకాట్ చేయడం సంచలనం రేపింది. సమావేశంలోని ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి కలిసి కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు.
విద్యావర్ధినిని తొలగిస్తూ, పాలకమండలి ప్రమేయం లేకుండా వీసీ రవీందర్ గుప్తా హయాంలో జరిగిన నియామకాలు, నిధుల ఖర్చు ఇతర అంశాలపై విచారణ జరపాలని తీర్మానం చేశారు. దానిని వీసీ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో వీసీకి అనుకూలంగా తీర్పు రావడంతో రవీంద్ర గుప్తా రెచ్చిపోయారు. ఏకంగా నవీన్ మిట్టల్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ప్రొఫెసర్ యాదగిరి నియామకం చెల్లదని చెప్పినట్టే బుధవారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈసీఈ హెడ్ ప్రొఫెసర్ నిర్మల దేవికి తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్‌గా నియమించారు. ఆ నియమకాన్ని అందుకున్న ప్రొఫెసర్ నిర్మల దేవి మధ్యాహ్నం తెలంగాణ విశ్వవిద్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నిర్మల దేవి వెనక్కి రావాలని కొత్త ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉస్మానియా నుంచి నిర్మల దేవి రిలీవ్‌ను రద్దు చేస్తున్నట్టు తక్షణం ఓయూ రిజిస్ట్రారుకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. వీసీ రవీందర్ గుప్తా హయాంలో రెండు సంవత్సరాల కాలంలోని నిర్మల దేవి నియామకం నాటికి ఐదుగురు రిజిస్ట్రార్‌లు మారడం విశేషం.