BRSకు మరో బిగ్ షాక్.. మున్సిపల్ చైర్ పర్సన్‌ పదవి ఊస్ట్

by Rajesh |
BRSకు మరో బిగ్ షాక్.. మున్సిపల్ చైర్ పర్సన్‌ పదవి ఊస్ట్
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం శనివారం నెగ్గింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టూ జాహ్నవిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన కాపీని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ అటు నుంచి గోవా క్యాంపునకు తరలించారు. 30వ తేదీ బలపరీక్ష ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు మొత్తం 37 మంది చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టి నెగ్గారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి పంపించి అక్కడినుండి గెజిట్ వచ్చిన తర్వాత మున్సిపల్ నూతన చైర్ పర్సన్ ఎన్నిక ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

చైర్మన్ సీటు దక్కేది ఎవరికి??

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సీటు దక్కేది ఎవరికనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొదట కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఉరుదొండ వనిత రవి గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన గొడవ కారణంగా ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుండి బీఆర్ఎస్‌కు చెందిన పలువురు కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ వైపు లాగుతూ సంఖ్యాబలం పెంచుకుంటూ వచ్చారు. అయితే వీరితో పాటు కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి సైతం చైర్మన్ సీట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి గెజిట్ వచ్చిన తర్వాత ఎన్నుకొనబోవు చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన వారికే దక్కుతుందంటూ పలువురు పేర్కొంటున్నారు. క్యాంపులో అంతా కలిసి ఉన్న సదరు ఇద్దరు చైర్మెన్ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లో ఉంటూ కాంగ్రెస్‌కు మద్దతు

కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో చైర్ పర్సన్ ఎన్నుకోవడానికి అవకాశం ఉన్న అవిశ్వాసం నెగ్గడానికి మాత్రం 35 మంది కౌన్సిలర్లు అవసరం. అయితే టిఆర్ఎస్ పార్టీకి చెందిన పదిమంది కౌన్సిలర్లు వీరితో పాటు క్యాంపునకు వెళ్లి అవిశ్వాసం నెగ్గె వరకు వీరి వెనకాలే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని ప్రధానమైన నలుగురు నాయకుల అనుచరులే ఇందులో ఎక్కువగా ఉండడం అనేక సందేహాలకు తావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పెద్దలే అటువైపు వెళ్ళమని సంకేతాలిచ్చారా.... లేక వారిపై ఉన్న అసంతృప్త అని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ బి ఆర్ ఎస్ పార్టీ కామారెడ్డిలో వలసలు వెళ్లడంలో మాత్రం సదరు నలుగురు ప్రోత్సాహం ఉందనేది బహిరంగ రహస్యం. ఏదేమైనాప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వలస వెళుతున్న నాయకుల సంగతి పక్కన పెడితే కామరెడ్డిలో మాత్రం పార్టీలో నీ వారే పార్టీ వినాశనానికి కారకులు అనే ఊపందుకుంది.

Advertisement

Next Story