- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్ 24 వరకు దసరా, బతుకమ్మ సెలవులు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో దసరా, బతుకమ్మ పండగల సెలవులను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. ఓయూ విద్యార్థులకు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24 తేదీ వరకు సెలవులు ఉంటాయని ఉస్మానియా యూనివర్సిటీకి వెల్లడించింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24 వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. యూజీ, పీజీ కాలేజీల విద్యార్థులకు దసరా, బతుకమ్మ సెలవులు వర్తిస్తాయి. 10 రోజుల సెలవుల అనంతరం ఓయూ క్యాంపస్‌తో పాటు.. ఓయూ అఫిలియేటడ్ కాలేజీలన్నీ తిరిగి అక్టోబర్ 25వ తేదీన ఓపెన్ అవుతాయని పేర్కొంది.
మరోవైపు దసరా, బతుకమ్మ పండగలను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 23 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు దినాన్ని అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా సెలవు దినాల్లో మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్టోబరు 24వ తేదీన కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.