బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు యూజ్ లెస్ పార్టీస్: అన్నామలై

by Satheesh |   ( Updated:2023-11-21 10:11:44.0  )
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు యూజ్ లెస్ పార్టీస్: అన్నామలై
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ యూజ్ లెస్ పార్టీలని.. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రగతిని వెనక్కి నెట్టాయని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై ధ్వజమెత్తారు. మంగళవారం శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి తరపున నిర్వహించిన రోడ్ షోలో అన్నామలై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ తెలంగాణ నిర్మాణం, యువత కలల సాకారం కోసం బీజేపీ, నరేంద్ర మోడీపై నమ్మకం ఉంచాలన్నారు. ఇక్కడున్న తమిళ ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story