- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ అభివృద్ధికి తెలంగాణ ఇంజిన్ లాంటిది: అంజనీకుమార్
దిశ, వెబ్‌డెస్క్: ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జీ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ సందర్భంగా తెలంగాణ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సమావేశంలో అంజనీకుమార్ మాట్లాడారు. దేశ అభివృద్ధికి తెలంగాణ ఇంజిన్ లాంటిదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ తెచ్చేందుకు మహేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలో మహేందర్ రెడ్డి సంస్కరణలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న మహేందర్‌రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగియనుంది. ఉదయం ఆయనకు రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో ఫేర్‌వల్ పరేడ్‌తో వీడుకోలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఐపీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అటెండ్ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు డీజీపీ కార్యాలయంలో అంజనీ కుమార్ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.