హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. బీజేపీ నేతల ఘన స్వాగతం

by Javid Pasha |   ( Updated:2023-09-16 16:15:28.0  )
హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. బీజేపీ నేతల ఘన స్వాగతం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి అమిత్ షాకు స్వాగతం పలికారు. డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో అమిత్ షా పాల్గొననున్నారు.

వేడుకల సందర్బంగా పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడనున్నారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో బీజేపీపై సీఎం కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని, నిధులు ఇవ్వలేదని విమర్శలు కురిపించారు. దీంతో రేపు జరగనున్న సభలో కేసీఆర్ ఆరోపణలకు అమిత్ షా కౌంటర్ ఇస్తారా..? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్‌పై అమిత్ షా ఎలాంటి విమర్శలు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పరేడ్ గ్రౌండ్‌లో సభ అనంతరం అమిత్ షా మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.

Advertisement

Next Story

Most Viewed