- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ ముఖ్య నేతలతో మీటింగ్!
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చారు. శనివారం నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించే పాసింగ్ పరేడ్‌లో భాగంగా ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక విమానంలో అమిత్ షా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలతో ఆయన శుక్రవారం రాత్రి అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునిల్ బన్సల్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా పలువురు ముఖ్యులతో ఆయన భేటీ నిర్వహించారు. తెలంగాణకు ప్రతినెలా ఒకసారి పర్యటిస్తానని అమిత్ షా పర్యటన సాగిస్తారని తెలిసిన విషయమే. వాస్తవానికి అఫీషియల్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన షా బీజేపీ నేతలతో భేటీ నిర్వహించడంతో ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారోననే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పలు రకాల వ్యూహాలను అనుసరిస్తున్న బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగులను ప్రారంభించింది. ఈనెల 25వ తేదీ వరకు ఇది కొనసాగనుంది.