Harish Rao: అల్లు అర్జున్ అరెస్ట్.. అసలు కారణం చెప్పిన మాజీ మంత్రి హరీశ్ రావు!

by Ramesh N |
Harish Rao: అల్లు అర్జున్ అరెస్ట్.. అసలు కారణం చెప్పిన మాజీ మంత్రి హరీశ్ రావు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ అవార్డు విజేత నటుడు అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun's Arrest)ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా తెలిపారు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని ప్రశ్నించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని, చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనేని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు? అని నిలదీశారు. రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన (CM Revanth Reddy) రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలని మండిపడ్డారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? అని ప్రశ్నించారు. ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులు ఛిద్రం చేశారని, దీనికి ఎవరిని అరెస్టు చేయాలని ఆరోపించారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలని, చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed