HYD: అల్లు అర్జున్‌ రిలీజ్‌ మరింత ఆలస్యం

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-13 16:14:47.0  )
HYD: అల్లు అర్జున్‌ రిలీజ్‌ మరింత ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) విడుదలకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్డర్ కాపీలో తప్పులు, సవరణల కారణంగా మరో గంట ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తమకైతే ఇప్పటివరకు ఎలాంటి ఆర్డర్ కాపీలు అందలేదని జైలు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రూ.50 వేల పూచీకత్తు, పర్సనల్ బాండ్ తీసుకొని విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జైలు పరిసరాలకు బన్నీ అభిమానులు భారీ చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌కు మద్దతుగా సినీ ప్రముఖులు వరుస ట్వీట్లు పెట్టారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో ఒకరినే బాధ్యుడిని చేయడం బాధాకరమని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. సినీ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా భారీగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed