Allu Arjun Arrest: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్

by Ramesh Goud |
Allu Arjun Arrest: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Roads) సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం అల్లు అర్జున్ ని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తరలించారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నటుడిని రెండు గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ విచారణ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ నేతృత్వంలో జరిగింది. అనంతరం పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి (Osmania Hospital)కి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి వైద్యులు పోలీసుల సమక్షంలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తర్వాత పోలీసులు నటుడుని నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచనున్నారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఫాలో అవుతున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed