కవితను అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆరోపణలు: డీకే అరుణ

by Hamsa |
కవితను అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆరోపణలు: డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారనే భయంతోనే ప్రధాని మోడీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లూ లేనిది ఎమ్మెల్సీ కవితకు ఒక్కసారిగా మహిళలపై ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలుసని చురకలంటించారు.

కేసీఆర్ మంత్రి వర్గంలో మహిళలు లేనప్పుడు కవిత ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో పెంచిన ట్యాక్స్ లపై బీఆర్ఎస్ ముందు సమాధానం చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు. ఇవన్నీ కేవలం కవితను అరెస్ట్ చేస్తారనే భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీపై ఆరోపణలు చేసినందుకే అరెస్ట్ చేస్తున్నారనే వాతావరణం క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed