- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కారణంగా మోస్తారు వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కర్ణాటక మహారాష్ట్రలను ఆనుకుని ఉన్న జిల్లాలతో పాటు, ఖమ్మం వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి, కృష్ణ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే వారం రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పట్టగా.. సోమవారం నుంచి మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేడు(బుధవారం) తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తున్నాయని అలర్ట్ జారీ చేసింది.ఇందులో అదిలాబద్, మంచిర్యాల, మహబూబాబాద్, కొమురం భీం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే మంగళవారం రోజు ఖమ్మం జిల్లాలోని గుబ్బగుర్తి లో అత్యధికంగా 14.8 సె.మీ వర్షపాతం నమోదు కాగా.. తల్లాడలో 11.8, రఘునాధపాలెంలో 10.7 సెంటి మీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆరు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. జిల్లాల అధికారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.