- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ALERT : రాగల 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు.. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హుస్సేన్ సాగర్‌లో తప్పిన ప్రమాదం...
హస్సేన్ సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలులకు హుస్సేన్ సాగర్‌లో భాగమతి బోటు అదుపు తప్పింది. గాలి వేగానికి దూరంగా వెళ్లిపోయింది. ఆ సమయంలో బోటులో సుమారు 30 మంది పర్యాటకులు ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ బోట్ క్లబ్ సిబ్బంది.. స్పీడ్ బోట్ల సాయంతో పర్యాటకుల బోటును తీరానికి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.