అలర్ట్ : విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు

by Sathputhe Rajesh |
అలర్ట్ : విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు
X

దిశ , తెలంగాణ బ్యూరో : వేసవి సెలవులు పూర్తి అయ్యేందుకు ఇక కేవలం 6 రోజులే మిగిలింది. జూన్ 12 వ తేదీ నుండి ఇక బడి గంట మోగనుంది. ఈ మేరకు 2023 -24 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్టంలోని అన్ని పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్‌ను డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం జూన్ 12న పాఠశాలలు పున ప్రారంభించాలని పేర్కొంది. జూన్ 3 నుండి 9 వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరింది. పదవతరగతి విద్యార్థులకు సిలబస్‌ను 10 జనవరి 2024‌లోగా పూర్తి చేయాలని అలాగే పునశ్చరణ తరగతులను నిర్వహించి వార్షిక పరీక్షలకు ముందుగానే ప్రీఫైనల్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయాలని ఆదేశించింది.

అదేవిదంగా ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు 29 ఫిబ్రవరి 2024 లోగ సిలబస్‌ను పూర్తి చేయాలని టార్గెట్ విధించింది. రివైజెడ్, రెమెడీయల్ తరగతులను నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని పేర్కొంది . ఎస్ ఏ 2 పరీక్షలను మార్చి 2024 లోగ నిర్వహించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించింది. పాఠశాలలో తప్పనిసరిగా యోగ, మెడిటేషన్ తరగతులను నిర్వహించాలని పేర్కొంది. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం 90 ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లాల విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేసారు.

నో బ్యాగ్ డే

పిల్లలో చదువు అంటేనే ఒక రకమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి నుండి వారిని మానసికంగా ఆహ్లాదకరమైన రీతిలో ఒత్తిడి ని తగ్గించేందుకు నో బ్యాగ్ డే ను పరిచయం చేసారు . ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలో అమలు చేయాలి ఆదేశించింది . పిల్లలు చదివేదానికంటే మోసే పుస్తకాలే ఎక్కువ. మోసి.. మోసి.. భూజాల మీద ప్రభావం పడుతోంది. అందుకే ఓ పాఠశాలలో వారంలో ఓ రోజును 'నో బ్యాగ్ డే'గా ప్రవేశ పెట్టారు. బరువైన బ్యాగులతో తరగతులకు వెళ్లే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సికింద్రాబాద్‌ ఆర్‌కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమం ప్రారంభమైంది.

అరబిందో సొసైటీ పుదుచ్చేరి సహకారంతో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకమైన విధానాన్ని పరిచయం చేశారు.దీని దశలవారీగా అన్ని పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది . ఆ రోజున విద్యార్థులు బ్యాగులు లేకుండానే పాఠశాలకు రావాలి . రొటీన్ విధానం నుంచి ఆహ్లాదకరమైన పురోగతిని విద్యార్థులు సాధించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొదటి 'నో బ్యాగ్ డే' నాడు, విద్యార్థులకు వారి వయస్సు, తరగతికి అనుగుణంగా అనేక వినోదభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు . I నుండి V తరగతుల వరకు థంబ్ పెయింటింగ్, పేపర్ మాస్క్ మేకింగ్, తోలుబొమ్మలను ఉపయోగించి కథ చెప్పే కళ, పంచతంత్ర పాత్రలను నాటకీయం చేయడం, తోలుబొమ్మల తయారీ, రేఖాగణిత ఆకృతులను ఉపయోగించి 2 డి /3 డి మోడల్ మేకింగ్, హాస్య కవితా సమ్మేళనం వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యక్రమాలు ఉంటాయి . అంతేకాకుండా హెమ్మింగ్ విద్యార్థులు జీవన నైపుణ్యాలను పొందుపరిచేలా ప్రోగ్రామ్స్ పెట్టారు. హ్యాపీనెస్ థెరపీగా పరిచయం చేస్తారు .

పండుగ సెలవులు

దసరా పండుగను పురస్కరించుకుని 13 అక్టోబర్ నుండి 25 అక్టోబర్ వరకు సెలవులు, అలాగే క్రిస్టమస్‌కు మిషనరీ పాఠశాలకు 22 డిసెంబర్ నుండి 26 డిసెంబర్ వరకు సెలవులు వుంటాయని తెలిపింది. ఇక సంక్రాంతికి 12 జనవరి 2024 నుండి 17 జనవరి 2024 వరకు ( 6 ) రోజులు సెలవులను ప్రకటించింది. వేసవి సెలవులు 24 ఏప్రిల్ 2024 నుండి 11 జూన్ 2024 వరకు వుంటాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed