ALERT : గోల్కొడ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?

by Rajesh |
ALERT : గోల్కొడ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. సికింద్రాబాద్-విజయవాడల మధ్య నడిచే శాతవాహన ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ ప్రెస్ లను ఆగస్టు 5 నుంచి 10 వరకు రద్దు చేసినట్లు ప్రకటించింది. వీటితో పాటు పలు రైళ్ల సేవలను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. విజయవాడ డివిజన్ పరిధిలో మూడో లైన్, సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంలో పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ రెండు రైళ్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29, 31 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించింది.

సికింద్రాబాద్-ముంబాయి మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ ఈ నెల 30న ముంబాయి-సింద్రాబాద్ మధ్య నడిచే ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ ఈనెల 31న రద్దయింది. విజయవాడ-భద్రాచలం రోడ్, డోర్నకల్-విజయవాడ మధ్య రైళ్లు సైతం ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దయ్యాయి.

ఈ రైళ్ల దారి మళ్లింపు..

ఆదిలాబాద్-తిరుపతి మధ్య కృష్ణా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గూడురు మధ్య తిరిగే సింహపురి, హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి రైళ్లను దారి మళ్లించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది.



Next Story