అలర్ట్ : ‘దిశ’ బ్రాండ్ ఇమేజ్ కాపీకి యత్నం.. మాకు సంబంధం లేని వెబ్ సైట్లు ఇవే

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-07 14:57:51.0  )
అలర్ట్ : ‘దిశ’ బ్రాండ్ ఇమేజ్ కాపీకి యత్నం.. మాకు సంబంధం లేని వెబ్ సైట్లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: ‘దిశ’ డిజిటల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసి ప్రధాన పత్రికలతో రీడర్ షిప్‌లో దూసుకుపోతుంది. సత్యం వైపు గమనాన్ని అక్షర యజ్ఞంతో అప్రతిహసంగా కొనసాగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దిశ’ పేపర్ క్లిప్, వీడియో లింక్ దాదాపు అన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతూ నే ఉంటుంది. ఈ రోజు వార్తను రేపు ఇవ్వడమనే పాత ట్రెండ్‌కు చెక్ పెడుతూ వార్తను జెడ్ స్పీడ్‌లో ప్రజల ముందుంచడంలో ‘దిశ’ దూసుకెళ్తుంది.

‘దిశ’ డైనమిక్ ఎడిషన్లను ఫాలో అవుతూ కొన్ని పత్రికలు ఇప్పటికే డైనమిక్ ఎడిషన్లు ప్రారంభించగా ప్రధాన పత్రికలు సైతం ఈ ట్రెండ్ వైపే మొగ్గు చూపుతున్నాయి. అయితే ప్రస్తుతం ‘దిశ’ పాపులారిటీ ఓ రేంజ్‌కు చేరడంతో ‘దిశ’ పేరుకు ఓ ట్యాగ్‌ను తగిలించుకుని అనేక వెబ్ సైట్లు, ఈ - పేపర్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లకు గాని, ఈ - పేపర్లకు గాని ‌‘దిశ’తో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇస్తున్నాం. ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ ఉన్న మా ‘దిశ’ లోగోను వాడితే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరిస్తున్నాం.

‘దిశ’ మీడియాకు సంబంధం లేని వెబ్‌సైట్లు ఇవే..

www.dashadisha.com

www.dishanalgonda.com

www.telanganadisha.com

www.suriyadisha.com

కావున పాఠకులు ఈ విషయాన్ని గమనించాలని ఎప్పటిలాగే ‘దిశ’కు మద్దతుగా నిలవాలని కోరుతున్నాం.

Advertisement

Next Story