- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీన్మార్ మల్లన్నపై కేసులు దుర్మార్గం: ఆకునూరి మురళి
దిశ, డైనమిక్ బ్యూరో: తీన్మార్ మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గం అని సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక లపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. తీన్మార్ మల్లన్న, విఠల్, సుదర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఎస్ డీఎఫ్ ఖండిస్తోందని ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు.
కేసీఆర్ పరిపాలన కారణంగానే ఇంత మంది తమ గళాన్ని విప్పుతున్నారని అన్నారు. యాక్టివిస్టులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ఆర్టీఐ కార్యర్తలు ప్రభుత్వం మీద గొంతు ఎత్తడానికి కారణం మీ పరిపాలన కాదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తొలివెలుగు మాజీ ఉద్యోగి రఘు, తీన్మార్ మల్లన్న, ఆర్టీఐ కార్యకర్త వెంకన్నలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని ఈ తరహా చర్యలను మానుకోవాలని సూచించారు.