- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మూసెయ్యండి.. ఆకునూరి మురళి ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కరెంటు కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. రోజుకు 2 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. అర టీఎంసీ నీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం కేవలం 0.4 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి సీరియస్ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ గుదిబండ తెల్ల ఏనుగు ప్రాజెక్టు రోజుకు 2 టీఎంసీల నీళ్లను తోడాల్సింది కేవలం 0.4టీఎంసీ అంటే 20% నీళ్లనే పంపు చేయగలుగుతున్నారని మండిపడ్డారు. ఒక ఎకరం పంటకు రైతులు ఒక లక్ష ఖర్చుపెడుతున్నారు.. కానీ, నీటి సరఫరాలో మాత్రం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం రైతులకు ఎకరానికి 25000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మూసెయ్యాలని, రాష్ట్ర ఆర్థిక వనరులను కాపాడాలని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు.
చూడండి ఈ గుదిబండ తెల్ల ఏనుగు ప్రాజెక్ట్ ను
— Murali Akunuri (@Murali_IASretd) March 2, 2023
రోజుకు 2 TMC ల నీళ్లను తోడాల్సింది 0.4TMC అంటే 20% నీళ్లనే పంప్ చేయగలుగుతున్నారు
ఒక ఎకరo పంటకు ఒక లక్ష ఖర్చుపెడుతున్నారు
కాళేశ్వరం రైతులకు
ఎకరానికి 25000 ఇవ్వడం బెటర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూసెయ్యండి
రాష్ట్ర ఆర్ధిక వనరులను కాపాడండి pic.twitter.com/StZkWlzRBK