- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కు ఊహించని షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న కేసీఆర్ కు ప్రస్తుత పరిస్తితులు ఎదురు దెబ్బలా మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లకు దూరంగా ఉంటున్న గులాబీ బాస్ కు తన మిత్రులు చేస్తున్న వరుస ప్రకటనలు ఆలోచనల్లో పారేస్తున్నాయి. కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తో టీఎంసీ అధినేత్రి మమతా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారాయి. నిన్నా మొన్నటి వరకు థర్డ్ ఫ్రంట్ పై వాయిస్ రైజ్ చేసిన నేతలు కర్ణాటక ఫలితాలతో తమ స్వరాన్ని మార్చారు. ఈ మేరకు మమతా బెనర్జీ చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది. తాము కాంగ్రెస్ పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మమత చేసిన ప్రకటన ప్రతిపక్ష పార్టీలో చర్చనీయాశంగా మారింది. అయితే దీదీ ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నట్లు అఖిలేశ్ యాదవ్ సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు.
గతంలో మమత, అఖిలేశ్, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ వంటి నేతలంతా సమిష్టిగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు అఖిలేశ్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు దొందు దొందేనని అందువల్ల మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మూడో కూటమి ఏర్పాటుపై ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే కర్ణాటక ఫలితాలతో సీన్ మారిపోతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పేరు ఎత్తితేనే చిటపటలాడిన మమతా.. కాంగ్రెస్ పార్టీ బెంగాల్ లో తమకు పోటీకి రాకుంటే బలంగా ఉన్న చోట్ల మేము వారి పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మమత వ్యాఖ్యలను అఖిలేశ్ సైతం ఏకీభవించడంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ యాంటీ స్టాండ్ తో ఉన్న కేసీఆర్ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. కర్ణాటకలో మిత్ర పక్షంగా ఉన్న జేడీఎస్ భారీగా నష్టపోయింది. అండగా ఉంటారనుకున్న అఖిలేశ్, మమతా బెనర్జీలు కాంగ్రెస్ కు జై కొట్టాలనే నిర్ణయంపై కారు పార్టీ అధినేత ఎలా రియాక్ట్ అవుతారనేది చర్చగా మారుతోంది.
Also Read..
టీ కాంగ్రెస్లో సీఎం రేసుపై చర్చ.. వీహెచ్, కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
30 వేల ఎకరాలు అమ్మకానికి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క