- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేము మాయ మాటలు చెప్పలే.. రైతు భరోసాపై రైతు కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రేషన్ కార్డు.. రుణమాఫీకి ప్రామాణికం కాదని తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో కొన్ని పొరపాట్ల వల్ల రైతు రుణమాఫీ కొంత ఆలస్యం అయ్యిందని, 6 లక్షల దరఖాస్తులు వస్తే.. వాటిని పరిష్కారం చేసే పనిలో అధికారులు ఉన్నారని, అర్హులైన రైతులకు రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామలు కచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ అందిస్తామన్నారు. రైతు భరోసా విషయంలో తాము ఎప్పుడు మాయ మాటలు చెప్పలేదన్నారు. తమ పార్టీ దగ్గర అనేక రైతు భరోసా విషయంలో ఆధారాలు ఉన్నాయని అన్నారు.
కేసీఆర్.. ఓట్లు దండుకోవడానికే కేసీఆర్ రైతుబంధు, ధరణి తెచ్చారని ఆరోపించారు. వీటి వల్ల రైతాంగం మోసపోయిందన్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూస్తామని, ప్రజల సొమ్ము.. మీలాగా దోచి పెట్టమని, అర్హులకే పథాకాలు వర్తింపచేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతున్నాయని, అక్రమార్కులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.