Aghori : కత్తితో అఘోరి హల్చల్.. కేసు నమోదు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-29 06:14:45.0  )
Aghori : కత్తితో అఘోరి హల్చల్.. కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: మురవెల్లి మల్లికార్జున స్వామి(Komuravelli Mallikarjuna Swamy)ఆలయ పరిసరాల్లో కత్తి(With A Knife Attacked)తో వీరంగం సృష్టించిన అఘోరీపై పోలీసులు కేసు నమోదు(Police Register Case) చేశారు. ఆలయం వద్ధ కత్తితో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరచడంతో పాటు వీడియో రికార్డు చేస్తున్న ఓ రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేయడంతో భక్తుల భయాందోళనలకు గురయ్యారు. అఘోరీ దుశ్చర్యపై సిద్దిపేట సీపీ ఆదేశాలతో చేర్యాల పోలీసులు నాలుగు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయాని వచ్చిన అఘోరీ ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే వస్త్ర ధారణతో దర్శనానికి రావాలని ఆలయ అధికారులు సూచించగా..వారితో వాగ్వివాదానికి దిగింది. అదే సమయంతో ఆలయానికి వచ్చిన అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆమె ఆశీర్వాదం పొందేందుకు గుంపులు గుంపులుగా ఆమెవైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే అఘోరి ఆలయ ప్రవేశం చేసే క్రమంలో సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటిపై బట్టలు వేసుకుని ఆలయంలోకి రావాలని, జనాలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. అయినప్పటికీ ససేమీరా అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయ అధికారులు కలగజేసుకుని బలవంతంగా బట్టలు తొడిగించారు.

ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన అఘోరి కోపంతో ఊగిపోయింది. తనతో ఫొటోలు దిగాలనుకున్న వారిని భయాందోళనకు గురిచేసింది. అయినా వినకుండా తన దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడిచేసింది. కారులో తనవెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో ఇద్దరి ముగ్గురిని గాయపరిచింది. ఓ వ్యక్తిని వెన్నులో పొడవగా స్వల్ప గాయమైంది. ఇటీవల కరీంనగర్ నుంచి పెద్దపల్లిలో వైపు వెళ్తున్న అఘోరిని కొంతమంది ఆకతాయిలు వెంట పడి వేధించారు. దీంతో కారు ఆపి వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పారు.

గత నవంబర్ లోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి నగ్నంగా అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై, కారుపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడతానంటూ బెదిరించింది. వరంగల్ నగర శివారు బెస్తంచెరువు శ్మశాన వాటికలో పూజలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. స్థానికులంతా ఫిర్యాదు చేయడంతో మామునూరు పోలీస్ స్టేషన్‌లో లేడీ అఘోరీపై సెక్షన్ 325 కింద కేసు నమోదు చేశారు.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానంటూ ప్రకటించింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు.. కేదార్ నాథ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో సిద్దిపేట దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమె సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా కుశ్నపల్లిలోని ఇంటికి తరలించి గృహనిర్భందం చేశారు. ఆత్మార్పణ ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో కేథార్ నాథ్ వెళ్లిపోయారు.

తొలుత రాష్ట్రంలో కొండగట్టులో కనిపించిన అఘోరీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో నగ్న పూజలతో చర్చనీయాంశమైంది. అప్పటి వరకు అఘోరాలు మాత్రమే తెలిసిన జనానికి.. తాను మహిళా అఘోరీని అంటూ హడావిడి చేసింది. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల ఏదో ఒక చోట తన వివాదస్పద శైలితో వార్తల్లో నానుతోంది.

Advertisement

Next Story

Most Viewed