ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కవిత

by GSrikanth |
ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు వచ్చారు. 9 గంటల పాటు సుధీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రాత్రి 8:00 గంటలకు కవితను బయటకు పంపించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదు ఈడీ బృందాలు ఎమ్మెల్సీ కవితను విచారించాయి. విచారణను మహిళా అధికారి సమక్షంలో అధికారులు వీడియో షూట్ చేయించారు.

కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్‌ కంపెనీలో వాటాలు, రూ.100కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడీ కూపీ లాగినట్లు సమాచారం. ఇప్పటి వరకు లిక్కర్‌ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగింది. కవితతో పాటు రామచంద్ర పిళ్లై కూడా విచారణకు హాజరయ్యారు. కాగా, విచారణ అనంతరం కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవితకు అప్పటికే అక్కడ భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు.

Advertisement

Next Story

Most Viewed