- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్‌గా అడ్వొకేట్ షేక్ అనీఫ్ పాషా నియామకం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో పనిచేసే లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ సెల్ కన్వీనర్‌గా హైకోర్టు అడ్వొకేషన్ షేక్ అనీఫ్ పాషా నియమితులయ్యారు. న్యాయవాదిగా ఈ మూడు అంశాలపై అవగాహన ఉన్న పాషాను రాష్ట్రంలోని వ్యవహారాలను పర్యవేక్షించేలా ఆయన పేరును టీపీసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని, వెంటనే బాధ్యతలు చేపట్టాలని అశోక్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి, ఈ మూడు విభాగాల పనితీరును మెరుగుపర్చడానికి పాషా కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన అనీఫ్ పాషా న్యాయవాదిగా హైకోర్టులో సేవలందిస్తున్నారు. పార్టీ తనపై నమ్మకం ఉంచి లీగల్ సెల్, ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ విభాగాల బాధ్యతలను అప్పగించినందుకు పార్టీ పెద్దలకు, చైర్మన్ అశోక్ గౌడ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని పాషా అన్నారు.