TS: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై విచారణ వాయిదా

by GSrikanth |
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై విచారణ వాయిదా
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషన్‌పై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్లు కోరినట్లుగా స్టే ఇవ్వటానికి నిరాకరించింది. సరైన సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాలని టీఎస్పీఎస్సీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. మొదట ఈ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్‌కు వెళ్లింది. అయితే, తన కూతురు కూడా ఈ పరీక్ష రాస్తున్నందున తాను విచారణ చెయ్యలేనని ఆయన పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేశారు. దీనిని స్వీకరించిన ఆ బెంచ్ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed