ఆదిత్య-ఎల్1 ప్రయోగం.. సీఎం కేసీఆర్ రియాక్షన్ ఇదే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-02 09:32:27.0  )
ఆదిత్య-ఎల్1 ప్రయోగం.. సీఎం కేసీఆర్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిత్య-ఎల్1 ప్రయోగంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో మైలురాయిని దాటిందన్నారు. ఇస్రో శాస్త్ర వేత్తల ప్రగతి.. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. కాగా ఈ రోజు శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని తీసుకుని పీఎస్ఎల్వీ - సీ 57 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) ఈ ప్రయోగానికి వేదిక అయింది. ఇక, ఆదిత్య - ఎల్ 1 గమనాన్ని ఇస్రో సైంటిస్ట్‌లు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story