- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరుకే ప్రపంచ రేపలింగ్ పోటీలు.. వసతులు మాత్రం శూన్యం
దిశ, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండి వాగు గ్రామపంచాయతీ పరిధిలోని గాయత్రి జలపాతం వద్ద ప్రపంచ వాటర్ రేపలింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కొంత మంది సాహసకులు పాల్గొంటున్నారు. జిల్లాలో ప్రపంచ పోటీలు జరుగుతున్నప్పటికీ అధికారులు, నిర్వహకులు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. మేడిగూడ నుండి గాయత్రి జలపాతం వరకు వెళ్లే రోడ్డు గుంతలు మయంగా కావడంతో వాటర్ రేపలింగ్ పోటీలను వీక్షించేందుకు వచ్చిన వీక్షకులు, సాహసులకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడ కూర్చోవడానికి షామియానా, త్రాగడానికి మంచినీరు కూడా కల్పించకపోవడంతో నిర్వాహకులపై సాహసకులు, వీక్షకులు మండిపడ్డారు.
ఆదివారం గాయత్రి జలపాతం ప్రపంచ రేపలింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు వస్తున్నట్టు శనివారం ప్రెస్ నోట్ ఇచ్చినా నిర్వహకులు రోడ్డు మరమ్మతులు చేపించలేదు. గుంతల మయమైన రోడ్డు ఉండడంతో ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని ప్రోగ్రాం రద్దు చేస్తున్నారని ప్రజలు అనుమానం వ్యక్త పరుస్తారు. ప్రపంచ పోటీలు నిర్వహిస్తూ కూడా సరైన వసతులు కల్పించక పోవడం సిగ్గుచేటని స్థానికులు చెప్పుకొస్తున్నారు. ప్రపంచ దేశాలు గాయత్రి జలపాతాన్ని గుర్తించినా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు గుర్తించలేక పోవడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.