Harish Rao : పిల్లలు వెంటిలేటర్ పై ఉంటే సీఎం ఏం చేస్తున్నారు

by Kalyani |
Harish Rao : పిల్లలు వెంటిలేటర్ పై ఉంటే  సీఎం ఏం చేస్తున్నారు
X

దిశ, వాంకిడి : పిల్లలు వెంటిలేటర్ పై ఉంటే, గిరిజన శాఖ మంత్రి అయిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు..? నిద్రపోతున్నారా..? పిల్లల ప్రాణాల కంటే.. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లు ముఖ్యమా అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజను ఆయన పరామర్శించారు. స్థానిక వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులు భరోసా ఇచ్చారు. వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో పదుల సంఖ్యలో పిల్లలు దవాఖానాల పాలయ్యా ఆరు రోజులు కావస్తున్నా కనీసం ముఖ్యమంత్రి ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగిందని, పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఏ ఆస్పత్రిలో ఉన్నారో అధికారులతో సమీక్ష నిర్వహించారా అని నిలదీశారు. గిరిజన పిల్లలంటే చిన్నచూపా అని ప్రశ్నించారు. చికిత్స పొందుతున్న శైలజ ప్రాణాలు పోతే ఎవరి బాధ్యత అని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని శైలజతో పాటు మిగితా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story