- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొగ్గు గనులను దేశ సంపదగా గుర్తిస్తాం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
దిశ, నస్పూర్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బొగ్గు గనులను దేశ సంపదగా గుర్తిస్తామని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత నెల 16 నుంచి బోధ్ నియోజకవర్గం పిప్పిరి నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్ర బయలుదేరి మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ వరకు పాదయాత్ర జరిగిందన్నారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా తెలంగాణకు తలమానికమని తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతిపెద్ద ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. నాడు బొగ్గు గనులను ఇందిరా గాంధీ జాతీయకరణ చేస్తే నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటేనే అందరికీ రూల్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి ఆస్తులను కాపాడుతామని తెలిపారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్, మాన్యం భూములు లాక్కొని వాటిని కూడా ప్లాట్లు చేసి అమ్ముతున్నారని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చి ఉన్న ఆస్తులను ప్రధాని మోదీ అమ్మేస్తున్నాడని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో మునిగింది అని చెప్పే ప్రధాని ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మీద అన్యాయంగా అనర్హత వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగం అందించిన అంబేద్కర్ పుట్టిన రోజున రాహుల్ గాంధీకి మద్దతుగా నస్పూర్ లో 14 న జై భారత్ సత్యాగ్రహ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, స్పోక్స్ పర్సన్స్ లోకేష్ యాదవ్, విజయ్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.