- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బావుల్లో నీళ్లు లేక ఎండుతున్న పంటలు..
దిశ, ఖానాపూర్ : వర్షాకాలంలో భారి వర్షాలు కురవడంతో పంటచేన్లు కొట్టుకుపోయి వరి పంటలు, మొక్కజొన్న, పత్తి, పసుపు పంటల దిగుబడి లేక రైతన్నలు అప్పుల ఊబిలో చిక్కుకొని పోయారు. వర్షాలు బాగా కురవడంతో భూ గర్భజలాలు పెరుగుతాయని వేసంగి పంటలు వేసుకోవచ్చని రైతులు వేసంగి వరి పంటలు వేసుకున్నా అది వారికి శాపంగా మారింది. వేసవి కాలం రాకముందే తోట బావులతో నీళ్లు లేక వరిపంటలు ఎండిపోతున్నాయి. నీరులేక ఎండిపోయిన వరి పంటలను రైతన్నలు పశుగ్రాసం కొరకు కూలీలతో కోపిస్తున్నారు.
ఒక్కో రైతు వారికి పశువులు లేక పంటపొలాలను అగ్నితో తగులబెడుతున్నారు. పూర్తివివరాల ప్రకారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో సదుర్మాట్ కు దగ్గరలో ఉన్న సుర్జాపూర్, మేడంపల్లి, కొత్తగూడెం, మస్కపూర్ గ్రామంలో ఉన్న రైతులు పంటలు పండక గోసపడుతున్నారు. వర్షాలు ఎక్కువగా పడడంతో పంటలు సరిగా రాలేదని వాపోయారు. వేసంగి పంటలు వేస్తే సదర్మాట్ ఆయకట్టులో అలాగే, సరస్వతి కెనాల్ ద్వారా డీ27 కెనాల్ లో నీరు రాక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఉన్న బావులు కూడా ఎండిపోయి పొలాలు బీటలు వారుతున్నయని, పంట పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చి అదుకోవలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.