ఏటీఎం, ఐదు కిరాణా షాపుల్లో చోరీకి యత్నం.. భయాందోళనలో వ్యాపారస్తులు

by Sumithra |
ఏటీఎం, ఐదు కిరాణా షాపుల్లో చోరీకి యత్నం.. భయాందోళనలో వ్యాపారస్తులు
X

దిశ, కాగజ్ నగర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలోని ప్రైవేట్ ఏటీఎం, బుక్ స్టాల్, పండ్ల దుకాణంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు చోరీకి యత్నించారు. సోమవారం ఉదయం గమనించిన కొంతమంది సాయి బుక్ స్టాల్ యజమానికి సమాచారం అందించగా షాపు వద్దకు వచ్చిన యజమాని 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆరాతీయగా ప్రైవేట్ ఏటీఎంలో దొంగతనానికి యత్నించగా ఏటీఎంలో నగదు లేకపోవడంతో, పక్కనే ఉన్న ఓ పండ్ల దుకాణం తాళాలు పగలగొట్టి దొంగతనానికి యత్నించారు. సాయి బుక్ స్టాల్ లో సైతం దొంగతనానికి ప్రయత్నించారు. అంతే కాకుండా రాయల్ వాచ్ షాప్ లో ఉన్న 5 వేయిల రూపాయలను చోరీ చేసి పరారయ్యారు. కగజ్ నగర్ పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకుంటామని తెలిపారు.

Next Story

Most Viewed