- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాడలేని కొనుగోలు కేంద్రాలు..
దిశ, ఖానాపూర్ : రైతే రాజు రైతు లేనిది దేశం లేదు అని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపన్యాసాలు ఇవ్వడం బాగుంటుంది. కానీ రైతు గోస పట్టించుకొనే నాధుడే లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం పంటను మార్కెట్ యార్డ్ కు తీసుకవచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వరి ధాన్యం అకాల వర్షాలతో తడిసిముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్ కు తర్లపాడ్, సతనపల్లి, ఖానాపూర్ గ్రామాల్లోని రైతులు వేసంగి పండించిన వరి ధాన్యాన్ని గత పదిరోజుల ముందు మార్కెట్ యార్డ్ కు తీసువచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మార్కెట్ యార్డ్ కు తీసుకవచ్చిన వరి ధాన్యంతో రాత్రి పగలు కష్టపడుతునట్లు తెలిపారు. మార్కెట్ యార్డ్ కు వరి ధాన్యం తీసుకవచ్చి పది రోజులు అయినా వరి కొనుగోలు కేంద్రాలు జాడనలేదు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోవడంతో మార్కెట్ యార్డ్ కు తీసువచ్చిన వరి శనివారం రాత్రి కురిసిన అకాల వర్షాల కు తడిసిముద్దైనది అని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
రైతులు మార్కెట్ యార్డ్ కు తీసుకవచ్చిన వరి ధాన్యాన్నిరాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు, రైతులు ఆదివారం మార్కెట్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అరగంట సేపు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు, కాంగ్రెస్ నాయకులకు నచ్చచెపి , రాస్తారోకో విరవించుకోవలని కోరారు. కాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చేంతవరకు విరమించడం లేదని దృడంగా పట్టుపట్టారు. అనంతరం చారవాణిలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారిణి తనుజ సోమవారం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ రాజుర సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోనికేని దయనంద్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ కు వరి ధాన్యాన్ని రైతులు గత పది రోజుల క్రితం తీసువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేయక ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని వారు విమర్శించారు. వర్షాలకు ధాన్యం తడువకుండా రైతులకు వ్యవసాయ మార్కెట్ అధికారులు తాటిపత్రాలు అందచేయడం లేదని విమర్శించారు. లేనిపక్షంలో రైతులతో ఆందోళనలు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ తోట సత్యం, షబ్బీర్ పాషా, జంగిలి శంకర్, కాంగ్రెస్ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.