వైద్యం కోసం గర్భిణీకి తప్పని తిప్పలు..

by Aamani |
వైద్యం కోసం గర్భిణీకి తప్పని తిప్పలు..
X

దిశ, బెజ్జూర్ : గర్భిణీ కి తిప్పలు తప్పడం లేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కమ్మర్గాం గ్రామానికి చెందిన సీడం శ్యామల అనే గర్భిణీ సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతూ బెజ్జూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవం కోసం వెళ్ళింది. మారుమూల గ్రామానికి అంబులెన్స్ వచ్చినప్పటికీ వెనక పట్టీలు ఊడిపోవడంతో ఆలస్యమైంది. గంట ఆలస్యంగా అంబులెన్స్ మరమ్మతులు చేసుకొని బెజ్జూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రసవం కోసం వచ్చినప్పటికీ బెజ్జూర్ లో కాన్పు కాలేదు. వైద్య సిబ్బంది బెజ్జూర్ నుండి మంచిర్యాలకు ఆసుపత్రికి ప్రసవం కోసం తరలించారు. ఆదివాసీ గర్భిణీ మహిళ హాస్పిటల్ కి వెళ్లాలంటే అంబులెన్స్ కు సరియైన రహదారి లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాకాలంలో అంబులెన్స్ రాలేని పరిస్థితి ఉంది. ఈ గ్రామాల వైపు అధికారులు ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడటం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆదివాసీల గ్రామాలైన గుండెపల్లి,కమ్మరగాం, జిల్లెడ, నందిగామ,మురళి గూడ అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ గ్రామాలకు ఒక్కోసారి అత్యవసర పరిస్థితులప్పుడు అంబులెన్స్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది. అధికారులు వెంటనే స్పందించాలని, రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి త్వరలో శాశ్వత రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని రవాణా సౌకర్యం కల్పించాలని పెంచికలపేట మండల వాసులు కోరుతున్నారు.

Next Story

Most Viewed