సెకండ్ ర్యాంక్ వచ్చింది.. జాబ్ మాత్రం రాలే..!

by Sumithra |
సెకండ్ ర్యాంక్ వచ్చింది.. జాబ్ మాత్రం రాలే..!
X

దిశ, భైంసా : డీఎస్సీ - 2024 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ విభాగంలో నిర్మల్ జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించిన తనకు 1:1 కౌన్సెలింగ్ కి పిలవలేదని, ఉద్యోగం రాలేదని కుబీర్ మండలం చాత గ్రామానికి చెందిన బాధితుడు చందుల వీరేష్ వాపోతున్నారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ లో టీచర్ ట్రైనింగ్ కోర్స్ 2012 సంవత్సరంలో హైదరాబాద్లో పూర్తి చేసి, దానికి అనుబంధ ఆరు నెలల కోర్స్ బెంగుళూరు చేశానని, దాదాపు గత 10 సంవత్సరాలుగా స్పెషల్ పిల్లలకి కుబీర్ మండలంలో విద్యను బోధిస్తున్నానన్నారు. అయితే రీసెంట్ గా 2024 డీఎస్సీలో నిర్మల్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్లు దాదాపు 20 కి పైగానే వున్న దీంట్లో జిల్లాలో రెండో ర్యాంక్ సాధించిన ఉద్యోగం రాలేదన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా 1:1 సెలెక్టడ్ లిస్ట్ పెట్టకుండానే ఈ 2 వ తేదీన సాయంత్రం 6 గంటలకు పిలిచి 9 గంటల రాత్రి వరకు కౌన్సిలింగ్ నిర్వహించి, పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారని వాపోతున్నారు.

అయితే 1:3 సెలెక్ట్ అయి గత నెల 29న వెరిఫికేషన్ డీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం హాజరయ్యానని, వెరిఫికేషన్లో తనకు రీమార్క్స్ ఏమి రాయలేదని కానీ 1:1 కి లిస్టులో జాబ్ రాలేదన్నారు. అయితే కొందరికి ఒరిజినల్స్ లేకుండానే డైరెక్ట్ గా కౌన్సిలింగ్, పోస్టింగ్ ఇచ్చారని, స్పీచ్ తెరపి టెక్నీషియన్ కి స్పెషల్ ఎడ్యుకేటర్ గా పోస్టింగ్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

సేమ్ క్వాలిఫికేషన్ కి వేరే జిల్లాలో పోస్టింగ్...

పోస్టుకు కావలసిన క్వాలిఫికేషన్ తగదన్న కారణం చూపుతూ కౌన్సెలింగ్ కు పిలవలేదని కారణం చెబుతూ అధికారులు వాపోతున్నారని విరేష్ వాపోతున్నారు. నవంబర్ 2న 1:1 లిస్ట్ పెట్టకుండానే, పోస్టింగ్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంతో రెండవ ర్యాంక్ సాధించిన వీరేష్ కి సమాచారం అందివ్వలేదని, అదే నైట్ కి వెళ్లి సంబంధిత అధికారికి అడగగా నీ క్వాలిఫికేషన్ క్లారిఫికేషన్ తీసుకొని నీకు రేపు అప్పాయింట్ ఇస్తామని తెలిపారని, తీరా ఇప్పటికీ ఏ సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. తనతో చదివిన వారికి వేరే జిల్లాలలో ఇదే విద్యార్హతలు వుండగా, ప్రస్తుతం వారికి పొస్టింగ్ ఇచ్చినప్పటీకి ఇక్కడ మాత్రం క్వాలిఫికేషన్ పై క్లారిఫికేషన్ తీసుకుంటామంటున్నారని వాపోతున్నారు. కలెక్టర్ చొరవ చూపి రి వెరిఫికేషన్ పెట్టి న్యాయ బద్దంగా పోస్టింగ్లు జరగాలని వీరేష్ కోరుతున్నారు.

Advertisement

Next Story