- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటి వెలుగు దేశానికి ఆదర్శం.. ఎస్పీ సురేష్ కుమార్..
దిశ, తాండూర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అవయవాలల్లో కళ్ళు ఎంతో ప్రధానమని, డిజిటల్ యుగంలో చాలా మంది కంటి చూపుతో బాధపడుతున్నారని అన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పోలీసు సిబ్బంది తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పోలీసు డివిజన్ పరిధిలోని 84 మంది పోలీసు సిబ్బంది కంటి పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు, అదనపు ఎస్పీ (ఏ.ఆర్) భీంరావు, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వినోద్ కుమార్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, ఆప్తమెటిక్స్ అఫిసర్స్ వెంకటేష్, సురేష్, వైద్య సిబ్బంది శృతి, శ్రీకాంత్, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.