చిన్నారి దుర్గ బాధ్యత మాదే.. దిశ కథనానికి స్పందించిన కలెక్టర్

by Nagam Mallesh |
చిన్నారి దుర్గ బాధ్యత మాదే.. దిశ కథనానికి స్పందించిన కలెక్టర్
X

దిశ, భైంసాః విధి రాసిన రాతలో ఒంటరి అయింది ఓ చిన్నారి అనే శీర్షికతో ఆదివారం దిశ పత్రిక కథనం ప్రచురించగా సహృదయులు తమ సహృదయతను చూపించారు. చిన్నారికి పలువురు ఆర్థిక సహాయం అందించగా, ఇప్పటికీ దాదాపు లక్షన్నర పైనే ఆర్థిక సహాయం చేకూరింది. ఆదివారం సాయంత్రం దుర్గ చిన్నారి అమ్మ గంగమణి అంతక్రియలు ముగిసిన తర్వాత నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చిన్నారి దుర్గతో వీడియో కాల్ లో మాట్లాడింది. బాధపడకు..! ధైర్యంగా ఉండాలి, మేమందరం నీతోనే ఉన్నాం ఏదైనా ఉంటే మాకు చెప్పు, విద్య వసతి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్. ప్రస్తుత పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. ముధోల్ తాలూకా తానూరు మండలం బేల్ తరోడ గ్రామంలో దుర్గ చిన్నారితల్లి గంగామణి(36) ఆత్మహత్య చేసుకొగా.. గతంలోనే తండ్రి మరణించగా పాప అనాథగా మిగిలి, అమ్మ అంత్యక్రియలకు డబ్బులకై గుడ్డను పరిచి సహాయార్థుల సహాయం కోరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story