- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Dr. Palwai Harish Babu : కేజీబీవీ పాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి..
దిశ, చింతల మానేపల్లి : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడానికి ఆ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక బృందం అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం ఆడపిల్లలను చదివిస్తుందని, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు వచ్చేలా ఆడపిల్లలు చదువులో రాణించాలని తెలియజేశారు. రాబోయే కాలమంతా మహిళా మణులదే అని, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ తో ప్రతిచట్టసభలో మూడింట ఒక వంతు మహిళలే ఉంటారని తెలిపారు. వర్షాకాలం సందర్భంగా అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని, వాటి నుంచి రక్షించుకోవాల్సిన తరుణోపాయాలను వారికి తెలియజేశారు. అంతకంటే ముందు పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోట ప్రసాద్, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ ఇంఛార్జి ఎస్ఓ మడావి శ్రీదేవి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, మండల అధ్యక్షులు తిరుపతి గౌడ్, చౌదరి రంగన్న, బక్కుబాయి, మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, మాజీ ప్లానింగ్ కమిటీ బోర్డు మెంబర్ కోండ్ర మనోహర్ గౌడ్, మాజీ ఎంపిపి కొప్పుల శంకర్ మరియు కస్తూర్బా గాంధీ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఓంకార ఆశ్రమం అభివృద్ధికి కృషి..
కర్జెల్లి గ్రామంలో గల గీతా మందిర్, ఓంకార ఆశ్రమం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు. ఆశ్రమాన్ని సందర్శించి రాధా - కృష్ణలను దర్శించుకున్నారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తానని, మారుమూల ప్రాంతంలో ఇలాంటి మందిరం నిర్మించడం గొప్పదన్నారు.