పేదల కడుపు నింపడమే ప్రధాన లక్ష్యం

by Sridhar Babu |
పేదల కడుపు నింపడమే ప్రధాన లక్ష్యం
X

దిశ, ఉట్నూర్ : పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలనే సంకల్పంతో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బొజ్జన్న బువ్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఖానాపూర్ నియోజవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అరికిళ్ల పరమేశ్వర్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బొజ్జన్న బువ్వ సత్రంలో ఐటీడీఏ కు వచ్చిన అర్జిదారులకు ఆయన అన్నం వడ్డించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలిని తీర్చడమే బొజ్జన్న బువ్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పేదల ఆకలి తెలిసిన నేత ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అని అన్నారు. ప్రతి సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట తన సొంత ఖర్చులతో బొజ్జన్న బువ్వ సత్రాన్ని నిర్వహిస్తున్నారని, ప్రజలు ఈ అన్నదాన సత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బిరుదుల లాజర్, సామాజిక కార్యకర్త మెస్రం జైవంతరావ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ రాజేష్, సుశీల్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed