- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో మొదటి విడత రాండమైజేషన్ పూర్తి
దిశ, ఆదిలాబాద్: రానున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం ఎన్నికల సంఘం నిబంధనలననుసరిస్తూ లోక్ సభ ఎన్నికలు 2024 పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఇతర పోలింగ్ అధికారులు 768 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 4385 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందని అన్నారు.
అందులో 2240 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2145 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ప్రతి టీంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు ఇతర పోలింగ్ ఆఫీసర్లు ఉంటారనీ తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కలెక్టరేట్ ఏవో అరవింద్, ఈడీఎం రవీందర్, ఎన్‌ఐసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.