- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణిలో రాజుకుంటున్న గుర్తింపు సంఘం ఎన్నికల వేడి
దిశ, మందమర్రి : సిరుల మాగాణి సింగరేణి కాలరీస్ కంపెనీలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి రాజుకుంటోంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని పలు సంఘాలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్డర్లను కెసిఆర్ ప్రభుత్వం లైట్ గా తీసుకుంటు పలు రకాల వాయిదాలతో నెట్టుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మూడవ దఫా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలను డిసెంబర్ 27 నాటికి ఆర్ఎంసి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పూర్తయిపోయి రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం పూర్తయిపోయింది. ఇక సింగరేణి ఎన్నికలకు అడ్డు లేకపోవడంతో ప్రధాన యూనియన్‌లు కార్మికులను ప్రసన్నం చేసుకోనికి గేటు మీటింగ్ లు, రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ కార్మికులను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కైరిగూడ నుండి కొత్తగూడెం వరకు వ్యాపించి ఉన్న సింగరేణి కోల్ బెల్ట్ పరివాసిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే అధికంగా గెలిచిన జాబితాలో ఉన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేలను కలుపుకొని కాంగ్రెస్ అనుబంధ యూనియన్ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ.ఎన్.టి.యు.సి.) కేంద్ర కమిటీ సీనియర్ ప్రధాన కార్యదర్శి బి జనక్ ప్రసాద్ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల ప్రచారానికి రావలసిందిగా కోరనున్నారని సమాచారం.
అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సైతం ఎన్నికల ప్రచారంలో సింగరేణి ప్రాంతానికి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనక్ ప్రసాద్ తనదైన శైలిలో సింగరేణి వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా భారత రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నుంచి వలసలకు వేదికగా ఐ.ఎన్.టి. యు.సి. శిబిరం బాటలు పడుతున్నట్లు ఏరియాలో ప్రచారం జరుగుతుంది. ఏరియాలో టీబీజీకేఎస్ నాయకులు వస్తే వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఎవరిని యూనియన్‌లోకి తీసుకోవాలి. ఎవరిని తీసుకోవద్దు అనే వాటిపై ఇప్పటికే కాంగ్రెస్ అనుబంధ సంఘం కీలక నాయకులు ఏరియా వ్యాప్తంగా రహస్యంగా సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గత 14 సంవత్సరాలుగా సింగరేణి గుర్తింపు సంఘం అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న యూనియన్ లో మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే దిశగా మందమర్రి ఏరియాలో ఆ యూనియన్ కీలక నేతలు దేవి భూమయ్య, కాంపల్లి సమ్మయ్య లు అడుగులు పడుతున్నాయి.