- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డెంగ్యూ కేసుల నివారణకు చర్యలు చేపట్టండిః కలెక్టర్ రాజర్షి షా
దిశ, ఆదిలాబాద్ః అదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసుల నియంత్రణ కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, మెప్మా సిబ్బందితో కలిపి అర్బన్ డెంగ్యూ యాక్షన్ ప్లాన్ రూపొందించి దాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డెంగ్యూ కేసుల పెరుగుదలకు నివారణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డులలో వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, మెప్మా సిబ్బంది కలిసి డ్రై డే, ఆంటీ లార్వా, స్ప్రేయింగ్, విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే కృష్ణ రావు, డి ఎం ఓ డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సాధన, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, మెప్మా, మునిసిపల్ శానిటేషన్ సిబ్బంది, ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.