- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోథ్ పీఏసీఎస్ చైర్మన్ సస్పెన్షన్
దిశ, బోథ్ : బోథ్ పీఏసీఎస్ చైర్మన్ సస్పెండ్ అయ్యారు. బోథ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కదం ప్రశాంత్ బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ కి చెందిన డైరెక్టర్ లు డీసీఓకి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన జిల్లా అధికారులు సొసైటీ చైర్మన్ కదం ప్రశాంత్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సొసైటీ డైరెక్టర్ లు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ రైతులకు అండగా ఉండాల్సిన నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడంతో భవిష్యత్తు లో పని చేసేవారు బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సొసైటీ డైరెక్టర్ లు గొర్ల రాజు యాదవ్, చాట్ల ఉమేష్, నారాయణ, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Suspension