Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ‌లో విద్యార్థుల ఆందోళన..

by Mahesh |   ( Updated:2022-06-14 07:16:38.0  )
Basara IIIT Students Protest Outside the Administration Office Over Problems In College
X

దిశ, బాసర: Basara IIIT Students Protest Outside the Administration Office Over Problems In College| నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ప్రతిరోజు సమస్యలు వేధిస్తున్నాయని.. ఎన్ని సార్లు చెప్పిన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి వి వాంట్ జస్టిస్.. అంటూ నినాదాలు చేస్తున్నారు. క్యాంపస్‌కు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని, పర్మనెంట్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, విద్యార్థులకు లాప్ టాప్ యూనిఫామ్ అందించాలని, తాగునీటి తో పాటు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 4 గంటలుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు ఆందోళన విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు క్యాంపస్ ఆవరణలో ఇంటర్నెట్ ఆప్ చేశారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని వచ్చిన నాయకులను లోపలికి అనుమతించకుండా పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story