జర్నలిస్టుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

by Javid Pasha |
జర్నలిస్టుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ
X

దిశ, నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సీనియర్ తెలుగు పాత్రికేయులు, కలాంగుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా వ్యవస్థాపకకులు, అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ ను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఉస్మాన్ తండ్రి శేఖ్ మొహమ్మద్ ( అలీ మియా) ఈ నెల 10న అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ తో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అలీమియాకు నివాళి అర్పించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

మున్సిపల్ కౌన్సిలర్లు విజయలక్ష్మి, అడ్ప పోశెట్టి, మహమ్మద్ తౌహీద్ ఉద్దీన్ రఫ్ఫు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రఫీ అహ్మద్ ఖురేషి, సీనియర్ ఉర్దూ పాత్రికేయులు జలీల్ అజహర్, ఎంఐఎం సీనియర్ యూత్ లీడర్ సయ్యద్ ఖాజా నాయఖ్ అలీ, బీఆర్ఎస్ సీనియర్ మైనార్టీ నాయకులు మొహమ్మద్ మతిన్ లు తదితరులు ఆదివారం రాత్రి నిర్మల్ పట్టణంలోని పంజేషా గల్లీ,ఖస్బా లో ఉన్న వారి పురాతన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మహమ్మద్ ఉస్మాన్ తో పాటు ఆయన సోదరులు మొహమ్మద్ కలీం, మొహమ్మద్ అలీమ్ సహోదరుల కుమారులు మొహమ్మద్ షోయేబ్ అజీజీ, మొహమ్మద్ షఫాఖత్ అజీజీ ,మహమ్మద్ దానిష్ అజీజీ, మహమ్మద్ షాజేబ్ అజీజీ, మహమ్మద్ రహత్ అజీజీ ,మొహమ్మద్ ఫాహత్ అజీజీ లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed