- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి భారీ షాక్...
దిశ, చింతలమానేపల్లి : సిర్పూర్ టీ బీజేపీ మండల అధ్యక్షుడు దామరపల్లి వెంకటేష్, ఆయన సతీమణి దామరపల్లి సుధ మహిళా మోర్చ జిల్లా జనరల్ సెక్రెటరీకి మంగళవారం బీజేపీ పార్టీ ఆఫీస్ లో బీజేపీ పార్టీ, పదవికి, సభ్యత్వానికి, రాజీనామా చేసినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు దామరపల్లి వెంకటేష్ తెలిపారు. సిర్పూర్ టీ లో బీజేపీ పార్టీని వెలుగులోకి తెచ్చిన పార్టీ బలోపేతం చేసిన పార్టీ ఎదుగుదలకి కీలక పాత్ర పోషించిన నాయకుడు వెంకటేష్, పార్టీ నేతలు మమ్మల్ని పక్కనపెట్టి తమకు నచ్చినవారికి పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి చెందారు. సిర్పూర్ టీ మండలంలో ప్రతి గ్రామాలలో పేద కుటుంబాలకు, రైతులకు న్యాయం చేస్తూ ఆదుకున్న నాయకుడు, ప్రతిఒక్కరి గుండెలో వెంకటేష్ చోటు సంపాదించుకున్నారు.
బీజేపీ పార్టీలో 9 సంవత్సరం నుంచి సేవ చేసిన ఎలాంటి గుర్తింపు రాలేదు. పార్టీ నియంతృత్వ వైఖరిపై కూడా వీరు అసంతృప్తిగా ఉన్నారన్నారు. పల్లెల్లో పేదవానికి ఎంతటి కఠినమైన సమస్యలు వచ్చిన తన సమస్యగా భావించి సమస్యలన్ని చలాకీగా పరిష్కరించే వారన్నారు. మాటరితనం అందర్నీ కలుపుకుని పోయే గుణం గలవారాని అభిమానులు తెలిపారు. తన సొంత ఖర్చుతో ఎన్నో ప్రేమ వివాహాలు, పుణ్యకార్యాలు చేసేవారాని, ఎంతో రాజకీయ అనుభవం, గుండె ధైర్యం శత్రువును ఎదిరించే దృఢ సంకల్పం గలవారాని, సిర్పూర్ టీ మండలంలో బీజేపీ పార్టీకి కీలక నేత తీసుకున్న నిర్ణయం వల్ల మండలం అంత బీజేపీ పార్టీ ఖాళీ అయిందని అభిమానులు తెలిపారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీలోకి 1000 మందితో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో భారీ చేరికలు ఉంటాయని వెంకటేష్ తెలిపారు.