బాల మేధావులూ.. భలా

by Sumithra |   ( Updated:2022-11-26 14:09:56.0  )
బాల మేధావులూ.. భలా
X

దిశ, బెల్లంపల్లి : ప్రోత్సహిస్తే ఆశ్చర్యపరిచే అద్బుతాలను చేస్తారని నిరూపించారు సంక్షేమ గురుకుల విద్యార్ధులు. తమ చిన్న మెదళ్ళలోని గొప్ప అల్లోచలనకు పదునుపెట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సైన్స్ ఫేర్ -2022లో మూడు రోజులుగా నిర్వహించిన వైజ్ఞానిక మేళాలో విద్యార్ధుల ఆలోచనలు వహ్వా అనిపించేలా ఉన్నాయి. వారి మాటలు భవిష్యత్తు మీద భరోసా కలిగించాయని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రముఖ వ్యవశాయ శాస్త్రవేత్త డా.రాజేశ్వర్ నాయక్ బృందం అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వైజ్ఞానిక మేళా -2022ను నాలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. శనివారంతో ముగిసిన ఈ సైన్స్ ఫేర్ లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని 10 జిల్లాలకు చెందిన 59 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్ధులు పాల్గొన్నారు.

సైన్స్ & టెక్నాలజీ, సేఫ్టీ &సెక్యురిటీ, ఆర్ట్, లిటరేచర్, ఈవ వైవిధ్యం వంటి పలు అంశాల్లో 118 ప్రదర్శనలు విద్యార్ధులు చేపట్టారు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న నీటి సమస్య, వాతావరణంలోని విపరీత మార్పులవల్ల కలుగుతున్న నస్టాలను వివరిస్తూ తక్కువ ఖర్చుతో ఎలా పరిష్కరించవచ్చో చిన్నారులు వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం సైతం విద్యార్ధుల ఆలోచనాత్మక ప్రదర్శనలకు ఫిదా అయ్యారు. ప్రతి విద్యార్ధి తన ప్రదర్శనలోని ప్రత్యేకతలను ఆంగ్లంలో తడుముకోకుండా అత్యంత సహజంగా సందర్శకులకు వివరించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమనిర్వాహనకు సంబందించి స్థానిక ప్రిన్సిపాల్ సందరాజ స్వరూప, సీఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, కాసిపేట ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ , జిల్లా కో ఆర్డినేటర్ రామాల బాల భాస్కర్ లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ నాయకురాలై నడిపిస్తూ ఆర్సీఓ స్వరూపరాణి కార్యక్రమాన్ని సమన్వయంతో విద్యార్ధులకు స్పూర్తినిచ్చేలా నిర్వహించారు. శుక్రవారం సైన్స్ ఫేర్ ను సందర్శించిన గురుకులాల జాయింట్ సెక్రెటరీ ఆర్.అనంత లక్ష్మి ఏర్పాట్లను చూసి అభినందించారు.

ముగింపు కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, బెల్లంపల్లి ఎంఈఓ మహేశ్వర రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓ కొప్పుల స్వరూపారాణి, స్థానిక ప్రిన్సిపాల్ సందరాజ స్వరూప, ఏఆర్సీఓ కోటిచింతల మహేశ్వర రావు, సీఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, పీడీ బాబూరావు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కోఆర్డినేటర్స్ రామాల బాలభాస్కర్, పోలోజు బాలరాజు, ప్రిన్సిపాల్స్ జి.సంగీత, పి.జ్యోతి, ఎం.లలిత కుమారి, ఊటూరి సంతోష్, శ్రీనాధ్, సిహెచ్ సంధ్యారాణి, రాజమాణి, ప్రేమరాణి, సూపరింటిండెంట్ గుజ్జుల సమ్మయ్య, బాలికల గురుకులం వైస్ ప్రిన్సిపాల్ స్వరూప, దాశరతరాం, రాధారాణి, మంజుల, శారద, పరమేశ్వరి, స్వప్న, అపర్ణ, గీతాంజలి, సమత, విజయ, వనజ, వై.నవీన్.ధర్మేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed