- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమాజ నిర్మాణంలో సావిత్రీబాయి సేవలు ఆదర్శం
దిశ, ఉట్నూర్ : భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పు కోసం సావిత్రి బాయి పూలే సేవలు అందరికీ ఆదర్శమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం స్థానిక కేబీ ప్రాంగణంలో గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సావిత్రి బాయి పులే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సావిత్రి బాయి పులే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల విద్యా కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. సమాజంలో అణిచివేతకు గురైన వారికి న్యాయం అందించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. విద్య పట్ల, లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె పోరాటం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మహిళను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థినులు ఖచ్చితంగా చదువుకోవాలని సూచించారు. విద్యతోనే సమాజ అభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ను కళాశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.