శభాష్ సర్పంచ్.. మంచి ఆలోచనతో చెత్తంతా అవుట్..!

by Disha News Desk |
శభాష్ సర్పంచ్.. మంచి ఆలోచనతో చెత్తంతా అవుట్..!
X

దిశ, ముథోల్: ప్రస్తుత సమాజంలో చెత్త కూడా పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని చెత్త బుట్ట నిండగానే చెత్తను రోడ్డుపై వేస్తున్నారు. దీనిని గమనించిన ఓ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించాడు. తనదైన ఆలోచనతో రోడ్డుపై చెత్త పడకుండా నిలువరించాడు. ఈ ఘటన ఆదాలాబాద్ ముథోల్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పరిసరల శుబ్రతలో భాగంగా ప్రభుత్వం చెత్త వేయడానికని తడిచెత్త, పొడిచెత్త అనే రెండు వేరు వేరు డబ్బాలను అందించింది. అయితే ఈ రెండు డబ్బాలు చెత్తతో నిండిన తర్వాత చెత్తను ఇంట్లో నుంచి బయటపడేస్తున్నారు.

ప్రజల తీరును గమనించిన కుబీర్ మండలం శివుని గ్రామ సర్పంచ్ దత్తురాంపాటిల్ ప్రతి మూడు ఇళ్ళకు పెద్ద ప్లాస్టిక్ డ్రంని ఏర్పాటు చేశారు. ఇంట్లోని ఎక్కువైన చెత్తను ఆ డ్రమ్ములో వేయాలని ప్రజలకు తెలిపారు. తద్వారా గ్రామంలో రోడ్లపై చెత్త కనిపించడం తగ్గిపోయింది. అంతేకాకుండా ఇటీవల రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేపట్టగా, గ్రామంలో ఎవరైనా గంజాయ్ సేవిస్తున్నట్లు, పండిస్తున్నట్లు తెలిస్తే ఆ సమాచారాన్ని సర్పంచ్‌కి తెలియజేస్తే వారికి రూ.5000 నజరాన ఇస్తామని ప్రకటించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed